#696సిలువ మోసినావా - శ్రమలకోర్చినావా - యేసున
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
అహా – నా దోషములే – మహావేదన పెట్టెనా – మోక్ష
రాజా – సర్వసత్య సంపూర్ణ ప్రదీప
1.
రాత్రియంతటను – రోదనముచే – గెత్సేమనే వనమందు – గడిపి గొప్ప
వేదనముతో – ప్రార్థింపగ తండ్రిని – ప్రాణనాథ
రక్తధారలు – నాకై రాల్చినావా ||సిలువ||
2.
కత్తులు గుదియలతో వచ్చినారా – కట్టికొట్టుచు నిన్ తిట్టినారా
కండ్లగంతలు కట్టి – కొరడాలతోను గొట్టి కఠినులంతా
ముండ్లముకుటమౌ దల ముత్తినారా ||సిలువ||
3.
కొయ్యనెత్తి – కల్వరిగిరి వరకు మోయుమనుచు నిన్ – మరి ముత్తినారా మూర్ఖులందరు నీదు – మోముపై నుమియుచున్ –
మోక్షనాథ యెరూషలేం – పురవీధుల త్రిప్పినారా ||సిలువ||
4.
జీవజలములు – జీవమునిచ్చే దేవ – దాహమాయెనా – ధరణియందు
నీకు – చేదు కలిపినట్టి – ద్రాక్షారసమునిచ్చి – ద్రాగనునిరా
దాహము తీరెనా – నీకు తండ్రి ||సిలువ||
5.
పంచఖండంబు – ప్రజలన్ రక్షింప – పంచగాయంబులను పొంది
తుదకు – అప్పగింతున్ తండ్రి – ఆత్మనిదిగో యనుచు – జెప్పి
నాథా ఆత్మకై అర్పణ నిచ్చినావా ||సిలువ||
6.
మరణమై నీవు మరి లేచినావా – మరణపు ముండ్లను – మరి విరిచినావా
మాకు విజయమిచ్చి – మోక్షపురికి మరల నరిగినావా
హల్లెలూయా మళ్ళీ వచ్చెదవా? ||సిలువ||