#704సిలువ మోసినవా
Author: రెవ. కొంగర సామ్యేల్ సంజీవిComposer/Ragam: ఛాయ: సిలువ మోసినావా – శ్రమలకోర్చినావాCategory: రెండవ అనుబంధము
ప
పరమ రక్షకుండు – పతిత పావనుండు
భూమి యందు లేరులేరయ్య యేసయ్యగాని – వేరే
లేరయ్య యేసయ్యగాని
1.
బోధలు చేసినవారు మాదిరి చూపినవారు భూమియందు లేరు లేరయ్య
యేసయ్య గాని వేరే లేరయ్య యేసయ్య గాని
2.
జాలి చూపినవారు – మేలు చేసినవారు – భూమి యందు లేరు లేరయ్య
3.
వెలుగునున్నవారు వెలుగు చూపినవారు – భూమి యందు లేరు లేరయ్య
4.
రోగం బాపినవారు – బాగు చేసినవారు – భూమి యందు లేరు లేరయ్య
5.
పాపం తీసినవారు – పాపిని బ్రోచినవారు – భూమి యందు లేరు లేరయ్య
6.
ప్రేమ చూపినవారు – ప్రాణం పెట్టినవారు భూమి యందు లేరు లేరయ్య
7.
సిలువను మోసినవారు – శ్రమల నోర్చినవారు భూమి యందు లేరు లేరయ్య
8.
క్షమను చూపినవారు – శాంతి నిచ్చినవారు భూమి యందు లేరు లేరయ్య
9.
రక్తం కార్చినవారు – ముక్తిని చూపినవారు భూమి యందు లేరు లేరయ్య
10.
మరణం పొందినవారు – మరల లేచినవాడు భూమి యందు లేరు లేరయ్య
11.
మళ్ళీ వచ్చేవారు – మోక్షము నిచ్చేవారు భూమి యందు లేరు లేరయ్య