#70దేవకుమారునికి స్తోత్రము
Author: మిక్కిలి సమూయేలుCategory: సాయంతనారాధన
ప
దేవకుమారా – దీనోపకారా
నా వంక దయను చూపి – నా యన్న రారా || దేవ ||
1.
వృక్షము బాసిన – పక్షి నేనయ్యా
అక్షీణ కరుణచే – రక్షింపవయ్యా || దేవ ||
2.
పాపుల పాలిటి – పరమదయాళూ
దీవించు నీ దయ – దీనునికిప్పుడు || దేవ ||
3.
వినుతింతు సద్గుణ – విమల విచారా
నన్ను బ్రోవవే యేసు – నామావతారా || దేవ ||
4.
భజన చేసెద నిన్ను – నిజ రక్షకుండ
విజయము చేయవే – జనరేతువాడా || దేవా ||
5.
కనికర మత్యంత – కరుణయుగలదు
నిన్ను నమ్ము వాని చేయి – విడి వలదు || దేవ ||
6.
మహనీయ గుణమణి – మండిత దేవా
ఇహ బాధ బాపవే – ఇమ్మానుయేలా || దేవ ||