#69దైవ స్తుతి
Author: నర్సళ్ల సమూయేలు సుబ్బయ్యCategory: సాయంతనారాధన
ప
సర్వదేశములారా – శ్రీ యేసే దేవుండు
ఉర్వి నుత్సాహముతో – గురుస్తోత్రము చేయను రండి || సర్వ ||
1.
ఆ ప్రభువే దేవుండు – అధికస్తోత్రార్హుండు
భూప్రజల నందరిని – బుట్టించిన భగవంతుండు || సర్వ ||
2.
మనము దేవుని వారము – మును మరి యాయన ప్రజలము
మనయము నా ఘనప్రభువు – నెనరుతో మేపెడి గొర్రెలము || సర్వ ||
3.
కృతజ్ఞతార్పణలు – కొల్లగను జెల్లింప
నాతని యావరణములో – నతి వినయముతో చేరండి || సర్వ ||
4.
ఆయన దయామయుడు – ఆయన కృపామయుడు
ఆయన ప్రేమ సత్యం – బనవరతంబుండు నిజమే || సర్వ ||
5.
శుభనామం మదినుంచి – ప్రభునామం స్తుతియించి
ఘననామం బతిభక్తిన్ – అనయంము గొలువుడి జనులారా || సర్వ ||
6.
పితృ పుత్రాత్మకును – ప్రియమహిమ మగుగాక
ఆదిన నొండిన రీతి – ననవరతంబుండు గాక || సర్వ ||