#68ప్రభువైన యేసునకు స్తుతి
Author: మిక్కిలి సమూయేలుCategory: సాయంతనారాధన
ప
ఘన భవదుపకృతులను మాటికిని నేను వినుతింతును దేవా –
నిజ సత్యము నొనరగా నాపై ననుక్రోశము దగ నూనుమవే క్రైస్తవ జన విహిత || ఘన ||
1.
ధోరణిగా నా దోషములు ఎంచక – సారెకు నాశ్రిత జనవరదా –
పారము దప్పిన పాతకుడగు నేను – నారడిబడ నీ కది బిరుదా || ఘన ||
2.
జలబుద్బుదముతో సమమని నా స్థితి – తెలియదు నీకది దేహధరా –
ఖలమయమగు నా కర్మము బ్రోవను – సిలువను బొందిన శ్రేయస్కరా || ఘన ||
3.
మందమతినని నా యందు నలక్ష్యము – నొందకు దేవా యేసు నందనా –
చందముగా నా డెందము కడు దెలివొందగా – నీ దయ నందుమా || ఘన ||