FaithWalk
← Back to Library

#7దైవ నామ స్తుతి

Author: బొంతా శామ్యూయేలుComposer/Ragam: శంకరాభరణముCategory: దైవారాధన — దైవస్తుతి
1.
నీతి సూర్య తేజమా జ్యోతి రత్న రాజమా పాతక జన రక్షకా పతిత పావన నామకా ॥నీతి॥
2.
మానవ సంరక్షకా దీన నిశ్చయ పోషకా దేవ మానవ నందనా దివ్య సుగుణ మందనా ॥నీతి॥
3.
ప్రేమ తత్వ బోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయకా ॥నీతి॥
4.
పాప చింతలన్నిటిన్ పారదోలుము ప్రభువా నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్ ॥నీతి॥