#6యెహోవా స్తుతి
Author: UnknownComposer/Ragam: యమన్Category: దైవారాధన — దైవస్తుతి
ప
భీకరుండౌ మా యెహోవా పీఠము
యెదుటను గూడరే ఏకమై
సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే ॥భీకరుండౌ॥
1.
మంటితోనే మమ్ము నెల్ల మానవులుగా
సృజించెను ఇట్టి శక్తుండౌ
ప్రభునే మెచ్చుగా మది నెంచుదము ॥భీకరుండౌ॥
2.
ఎరితోడు లేక మమ్ము సర్వేశ్వరుడు
సృజించెను ధరణిన్ దా నొక్కడే
మా దైవమని పూజింతుము ॥భీకరుండౌ॥
3.
పుట్ట గిట్టంజేయు దానై నట్టి దేవుని
శక్తిని బట్టుగా లోకస్థులారా
ప్రస్తుతింపరే భక్తిని ॥భీకరుండౌ॥
4.
మేటి సంగీతంబులపై మింట నారవ
మొందను చాటరే వేవేల
నోళ్లతో సన్నుతులు ప్రభు వందనము ॥భీకరుండౌ॥
5.
మిక్కిలి కష్టంబులతో మిత్తికిని
పాలొందను దిక్కులేని గొర్రెల
యట్లు తిరుగ జేర్పెను మందను ॥భీకరుండౌ॥