#691సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
సాగిలపడి మ్రొక్కెదము – సత్యముతో – ఆత్మతో
మన ప్రభు యేసుని – ఆ ఆ ఆ ||సాగిల||
1.
మోషేకంటే శ్రేష్ఠుడు – అన్ని – మోసములనుండి – విడిపించున్
వేషధారులను ద్వేషించున్ – ఆశతో – మ్రొక్కెదము ||సాగిల||
2.
అహరోనుకంటే శ్రేష్ఠుడు – మన ఆరాధనకు
పాత్రుడు ఆయనే ప్రధాన యాజకుడు – అందరము – మ్రొక్కెదము ||సాగిల||
3.
ఆలయముకన్న – శ్రేష్ఠుడు – నిజ – ఆలయముగా తానే యుండెన్ ఆలయము మీరు యనెను – ఎల్లకాలము మ్రొక్కెదము ||సాగిల||
4.
యోనాకంటే శ్రేష్ఠుడు – ప్రాణ –
దానముగా తను అర్పించెన్ – మానవులను విమోచించెన్ – ఘన పరచి మ్రొక్కెదము ||సాగిల||
5.
సొలొమోనుకన్న శ్రేష్ఠుడు –
సర్వజ్ఞానమునకు ఆధారూడు పదివేలలో
అతిప్రియుడు – పదిలముగా మ్రొక్కెదము ||సాగిల||
6.
రాజులకంటే శ్రేష్ఠుడు యాజకులుగా
మనలను చేసెన్ రాజరాజుగ
త్వరలో వచ్చున్ – రయముగాను మ్రొక్కెదము ||సాగిల||
7.
అందరిలో అతి శ్రేష్ఠుడు – మనకందరికి తానే
ప్రభువు హల్లెలూయకు పాత్రుడు – అనుదినము మ్రొక్కెదము ||సాగిల||