FaithWalk
← Back to Library

#692సీయోను పాటలు సంతోషముగను పాడుచు సీయోను వె

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
సీయోను పాటలు సంతోషముగాను పాడుచు సీయోను వెళ్ళుదము
1.
లోకాన శాశ్వతానందమేమియు – లేదని చెప్పెను ప్రియుడేసు పొందవలె నీ లోకమునందు – కొంతకాల మైనా శ్రమలు ||సీయోను||
2.
ఐగుప్తును విడిచినట్టి మీరు – అరణ్యవాసులై ఈ ధరలో నిత్యనివాసము లేదీ లలోన – నేత్రాలు కానానుపై నిలుపండి ||సీయోను||
3.
మారానుపోలిన చేదైన స్థలము – ద్వారా పోవలసి యున్ననేమి – నీ రక్షకుండగు యేసే నడిపును – మారని తనదు మాట నమ్ము ||సీయోను||
4.
ఐగుప్తు ఆశలు అన్నియు విడిచి – రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని – విధేయులై విరాజిల్లండి ||సీయోను||
5.
ఆనందమయ పరలోకంబు మనది – అక్కడనుండి వచ్చునేసు సీయోను గీతము సొంపుగ కలిసి – పాడెదము ప్రభుయేసుకు జై ||సీయోను||