#677ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు?
Author: UnknownCategory: రెండవ అనుబంధము
1.
ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవరు?
ఆ – ఆ – ఆ ప్రేమయై తానే నిలిచి – ప్రేమవాక్కులనే పలికి
ప్రేమతో ప్రాణము పెట్టి- ప్రేమనగరికి చనియె ||ప్రేమా||
2.
నిశ్చలమైన ప్రేమజీవికి – ఇలలో తావేది
ప్రేమ ద్రోహులేగాని – ప్రియమున చేరరు వాని
చేరిన చెలికాడగురా – సమయమిదే పరుగిడరా ||ప్రేమా||
3.
ఎంత ఘోరపాపాత్ములైన – ప్రేమించును రారా
పాపభారముతో – రారా – పాదములపై పడరా
పాపుల రక్షకుడేసు – తప్పక నిను రక్షించున్ ||ప్రేమా||
4.
ఇంత గొప్ప రక్షణను – నిర్లక్ష్యము చేసెదవేల?
รక్షణ దిన మిదియేరా – తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము – ముదమారగ జేకొనుము ||ప్రేమా||