#676ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించిన
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను
నరులేమి చేయగలరు భయమేమిలేదు నాకు
1.
గర్విష్టులైనవారు – నాతో పోరాడుచుండ
ప్రతిమాట కలవారూ – పరభావ మెంచుచుండ
ప్రభువా నా ప్రక్కనుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
2.
నేనెందు పోదుమన్నా – గమనించుచుండువారు నా వెంట పొంచియుండి – నన్ను కృంగదీయనెంచ
ప్రభువా! నా ప్రక్కనుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
3.
పగబూని వారు నన్ను – హతమార్చ నెంచియున్న
మరణంబునుండి నన్ను కడు వింత రీతిగానూ
ప్రభువా! నా ప్రక్క నుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
4.
జీవంపు వెలుగైన – నీ సన్నిధానమందు
నే సంచరించునట్లు – నే జారిపోకుండా
ప్రభువా! నా ప్రక్కనుండి – నన్ను తప్పించినావు ||ప్రభువా||
5.
నన్నాదుకొంటి నీవు – నన్నాదరించినావు
కొన్నావు నీవు నన్ను – మన్నించినావు నీవు
ఎన్నాళ్ళు బ్రతికియున్న – నిన్నే సేవింతు దేవా! ||ప్రభువా||