FaithWalk
← Back to Library

#675ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో పరికించిన శుభదినము గమనించిన యాక్షణము పరలోకముకై చిరజీవముకై – ప్రార్థించెను నా హృదయము ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె ||ప్రభు||
1.
దిశలన్నియు తిరిగితిని నాపాపపు దాహముతో దౌష్ట్యములో మసలుచును దౌర్జన్యము చేయుచును ధనపిపాసతో మృగవాంఛలతో దిగజారితి చావునకు ||ప్రభు||
2.
యేసు నీ రాజ్యములో భువి కేతెంచెడి రోజు ఈ పాపిని క్షమియించి జ్ఞాపకముతో బ్రోవుమని ఇల వేడితిని విలపించుచును ఈడేరును నా వినతి ||ప్రభు||
3.
పరదైనను ఈ దినమే నా ఆనందముతోనూ పాలోంగెదవు నీవనుచు వాగ్దానము చేయగనే (2) పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభుకడకు ||ప్రభు||