#674ప్రభు ప్రేమ తొలికేక - హృదయములో ప్రతిధ్వన
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ప్రభు ప్రేమ తొలిరేక – హృదయములో ప్రతిధ్వనించే
పాపక్షమ యేసునిలో – శరణు నొసంగుచు కనిపించే
1.
పాపవికారము పొడచూప – జీవితవిలువలు మరుగాయె
ఫలితముగా లోకములో – బ్రతుకుటయే నా గతియాయె
పలువురిలో కనబడలేక – దాహముతో నేనొంటరిగా
బావికని పయనింప – నాథుని దర్శనమెదురాయె
పావనుడు దాహముతో – జలమును ఇమ్మని నన్నుగోరె ||ప్రభు||
2.
జాతిని చూడని నేత్రముతో – పాపము శోకము హృదయముతో
జాలిని చాటించుచునే – తాకెను నామది వేదనతో
జాప్యము చేయక తెమ్మనియే – దాచుకొనిన నాపాపమును
జడియుచునే తెలిపితిని – ప్రభు వెరిగిన నా నిజస్థితిని
జయమొందె నాతనువూ – సరిగ నుడితివని ప్రభు తెలుపగా ||ప్రభు||
3.
దేహమునే నాసర్వముగా – భావించుచు మది పూజింప
దినదినమూ జీవితమూ – చావుగా మారిన కాలములో
దేవునిగా నా బంధువుగా – మరణ ప్రవాహము ఛేదించి
దరిజేర్చి దీవించి – నూతన జన్మ ప్రసాదించే
దయ్యాళ్లకు హరమును – స్తుతి మందిరముగా రూపించే ||ప్రభు||
4.
పాపము దాగును నాబావి – లోతును చూచినదెవరు
పోరాటవాటికయై – నా బ్రతుకును ఎరిగినవారెవరు
పాపికిని పాపమునకునూ – భేదము చూపినవారెవరు
పాపిని కాపాడుటకు – సిలువను మోసినవారెవరు
ప్రకటించె దైవకృప – తెరిచెను జీవన జలనిధులు ||ప్రభు||
5.
ఘటముతో వెడలితి నొంటరిగా – పితరుల తాతల జనములకై
కనబడెను బావికడ – రక్షణయూటల ప్రభుయేసు
కుండను వీడి పరుగిడితి బావిని గని చొని హృదయములో
ఘనమైన శుభవార్త – ఆతృప్తతతో ప్రజలకు తెలుప
గ్రామప్రజా కనుగొనిరి – విశ్వవిమోచకుడగు యేసున్ ||ప్రభు||