#672పాడెదన్ దేవా - నీ కృపలన్ - నూతన గీతములన్
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
పాడెద దేవా – నీ కృపలన్ – నూతన గీతములన్
స్తోత్రము చెల్లింతున్ (2) ఆ..ఆ..ఆ...(2)
1.
భూమి పునాదులు వేయకముందే యేసులో చేస్తివి
ప్రేమ పునాదులు వేస్తివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ||పాడెద||
2.
ప్రవిమల రక్తము కల్వరి సిలువలో కలుషునకు నిచ్చితివి
ప్రేమకృప మహా ఐశ్వర్యములతో పాపము తుడిచితివి నా పాపము తుడిచితివి ||పాడెద||
3.
పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి
అపరాధముల చే చచ్చిన నన్ను ధరణి బ్రతికించితివి నన్ను బ్రతికించితివి ||పాడెద||
4.
దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెరవిడిపించితివి ||పాడెద||
5.
ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము చేసితివి సత్యస్వరూపి నిత్యనివాసి సొత్తుగా చేసితివి నీ సొత్తుగా చేసితివి ||పాడెద||
6.
అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధన్యుని చేసితివి
ప్రియపట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి కృప వరముల నొసగితివి ||పాడెద||