FaithWalk
← Back to Library

#671యేసు చాలును - యేసు చాలును ఏ సమయమైన ఏ స్థ

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
యేసు చాలును – యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును
1.
పరమజీవము నాకు నివ్వ – తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును – మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు||
2.
సాతాను శోధనలధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగిననూ – లోబడక నేను వెళ్ళెదను ||యేసు చాలును||
3.
పచ్చిక బయలులో పరుండజేయును – శాంతి జలము చెంత నడిపించును – అనిశము ప్రాణము తృప్తిపరచును – మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు చాలును||
4.
నరులందరు నన్ను విడిచినను – శరీరము కుళ్ళి కృశించినను హరించినను నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడిచినను ||యేసు చాలును||