FaithWalk
← Back to Library

#673ప్రజలారే వేగమే రారే - నిజదైవమును కనుగొనర

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ప్రతివాడు మోక్షము చేర – ప్రభు యేసు వార్తను వినరారే ||
1.
పాపాత్ములనబడువారి – భారంబు తీయనగోరి ప్రభు యేసు చూపిన దారి – పరమందు సుఖమిడు దారి ||ప్రజలారే||
2.
ఏ జాతివారలైనన్ – యే దేశవాసులైనన్ ఏమైన భేదము లేక – యేసయ్య బ్రోచును వేగ ||ప్రజలారే||
3.
పాపాత్ములే తన సుతులు – प्रभु యేసునికి స్నేహితులు నీ పాపమెల్లను బోయెన్ – నీకింక మోక్షము కలుగున్ ||ప్రజలారే||
4.
ప్రయాసపడి భారమును – మోసెడు ఓ ప్రజలారా ప్రభుయేసుక్రీస్తే మీకు – విశ్రాంతి నిచ్చును రండి ||ప్రజలారే||
5.
యేసయ్యగాకను వేరే – యెవరైనా లేరిక రారే దోషంబులెక్కిన బాపి – ఆశీర్వదించును గాచి ||ప్రజలారే||