#670నే యేసుని వెంబడింతునని - నేడేగా నిశ్చయిం
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నే యేసుని వెంబడింతునని – నేడేగా నిశ్చయించితిని – నే వెనుదిరుగను – వెనుకానడను – నేడేసుడు పిలిచిన సుదినం ||నే యేసుని||
1.
నా ముందు సిలువ – నా వెనుక లోకాశలు – నాదే దారి – నా మనస్సులో
ప్రభు – నా చుట్టు విరోధులు నావారెవరు – నా యేసుని మించిన మిత్రులు – నా కలలో గాని కానరని ||నే యేసుని||
2.
కరువులైననూ – కలతలైననూ కలిసిరాని కలిమిలేములు –
కలవరంబులు కలిగిననూ కదలనింకా కష్టములైనా – వదలను నాదు నిశ్చయము ||నే యేసుని||
3.
శ్రమయైననూ బాధలైననూ – హింసయైన వస్త్రహీనత –
ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమనుండినను – ఎడబాపెడివారెవరు ||నే యేసుని||