FaithWalk
← Back to Library

#669నీ చేతితో నన్ను పట్టుకో - నీ ఆత్మతో నన్న

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నీ చేతితో నన్ను పట్టుకో – నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పిచేతిలో శిలను నేను – అనుక్షణము నన్ను చెక్కుము
1.
అంధకార లోయలోన – సంచరించిన భయము లేదు నీ వాక్యమ శక్తిగలది – నా త్రోవకు నిత్యవెలుగు ||నీ చేతితో||
2.
ఘోరపాపిని నేను తండ్రి – పాప ఊబిలో పడియుంటిని లేవనెత్తుము శుద్ధిచేయుము – పొంద నిమ్ము నీదు ప్రేమను ||నీ చేతితో||
3.
ఈ భువిలో రాజు నీవే – నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను – జీవితాంతము సేవ చేసెదన్ ||నీ చేతితో||