FaithWalk
← Back to Library

#668నా సంకటంబులన్నియు పోయె - సంహారదూత నన్ను

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నా సంకటంబులన్నియును పోయె సంహారదాత నన్ను దాటిపోయె
1.
గొర్రెపిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంకట||
2.
ఫరోకు నేనింక దాసుడను కాను పరమకానానుకు హక్కుదారుడను ||నా సంకట||
3.
మారాను మధురముగా మార్చినాకు బండను పగులగొట్టి దాహము తీర్చెను ||నా సంకట||
4.
మనోహరముగానున్న కానాన్ రాజ్యమే అదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంకట||
5.
ఆనందమే పరమానందమే కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంకట||
6.
అరణ్యజీవితమున యేసు నాయకుడు ప్రతిదినము నూతన మన్నా ఆయన ఇస్తాడు ||నా సంకట||
7.
నా బలము నా ఆశ్రయము నా రక్షణ యేసయ్య – హల్లెలూయా ||నా సంకట||