FaithWalk
← Back to Library

#667నా ప్రియ యేసునిపై ఆనుకొని - అరణ్య మార్గమ

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నా ప్రియ యేసునిపై ఆనుకొని – అరణ్య మార్గమున నడుచుటయే – ఆనంద జీవితము ||నా నా||
1.
లిల్లీపుష్పం శారోనురోజ – పరిశుద్ధమైన మాదు తండ్రి పూర్ణరూప సౌందర్యుడే – కీర్తింపతగిన దేవ ||నా నా||
2.
కన్యకలు ప్రేమించు దేవ – నా ప్రభు నామము పరిమళమే యేసుని వెనుక వచ్చితిమి – నన్ను ఆకర్షించెను ||నా నా||
3.
ప్రేమధ్వజ మెగురుచుండగ – ప్రియుని సముఖము కలుగుటచే జల్లరు వృక్షము క్రింద కలిగెను – ప్రియుని ఆదరణ ||నా నా||
4.
నిద్రించు రాత్రి సమయమునందు – నిత్యం నా ఆత్మ మేల్కొని నా తలుపు నొద్ద నిలిచిన – యేసుని ప్రేమించెదన్ ||నా నా||
5.
అగ్నిజ్వాల యేసుని ప్రేమ – మరణమువలె బలవంతమైనది నీటి ప్రవాహమువలన – ఆ ప్రేమ చల్లారదు ||నా నా||
6.
దీనస్తంభము వలె దిగివచ్చును – దేవకుమారుడు మహిమతో ఘనులైన వారి రథమువలె పై కెగరిపోదును ||నా నా||