FaithWalk
← Back to Library

#665నా నిమిత్తమాయన - మహిని శ్రమలు పొందెను ఘన

Author: మనల దోషరహితులనుComposer/Ragam: చేయనుద్దేశించెన్ – ప్రాణమర్పించెనుCategory: రెండవ అనుబంధము
ప
నా నిమిత్తమాయన – మహిని శ్రమలు పొందెను ఘన ధనముల రోసెను – అనుమతించె చావుకు
1.
నా నిమిత్తమే (3) మరణమాయెను తన జీవమును నాకు – బలిగా ధారపోసెను ||నా నిమిత్త||
2.
గొర్రెపిల్ల రీతిగా – గొప్ప శాంతి చూపెను ఉమ్మి నంత మోసిన – యోర్చె మౌనవృత్తిని ||నా నిమిత్త||
3.
అతడు దోషమెరుగడు – అతడు కపటమెరుగడు అయిననూ దేవుడు – అతని నలిగగొట్టెను ||నా నిమిత్త||
4.
అతడు ఇలను పొందిన – అధిక దెబ్బలవలన క్షితి నాలో కలిగెను – స్వస్థత మది రూఢిగా ||నా నిమిత్త||
5.
రోగముల్ భరించెను – వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడెన్ – బాధలన్ సహించెను ||నా నిమిత్త||
6.
గాయములను పొందెను – కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ – ఎలమిలో సహించెను ||నా నిమిత్త||
7.
ఎదిగె నాయన – మన యెడల దీన వృత్తిని సదమలమగు ప్రీతితో – సరకుచేయ మైత్రిని ||నా నిమిత్త||
8.
తన అనుభవమున