#664నాదు జీవమాయనే - నా సమస్తము నా సర్వస్వము
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నాదు జీవమాయనై – నా సమస్తము నా సర్వస్వము
యేసుకే – నాదు జీవము నాదు దైవము కవి దివ్య తేజము
1.
కృంగినవేళ భంగపడినవేళ – అద్దరికి చేర్చెను
చుక్కానిలేని నావవలె నేనుండ అద్దరికి చేర్చెను ఆత్మతో
నింపెను ఆలోచన చేసెను ||నాదు||
2.
సాతాను చేనైన కుములుచున్న వేళ
విడిపించె శ్రీ యేసుడే – రక్తమంత కార్చి
ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను సాతానుని
అణగద్రొక్క అధికార బలమిచ్చెను ||నాదు||
3.
కారుమేఘాలే క్రమ్మినవేళ – నీతిసూర్యుడు నడిపించును
తుఫానులెన్నో చెలరేగి లేచిన – నడిపించును నా జీవితనావ
త్వరలో దిగివచ్చును – తరలిపోదుము ప్రభునితో ||నాదు||