#666నా ప్రాణప్రియుడా యేసు రాజా అరిపింతును నా
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నా ప్రాణప్రియుడా యేసు రాజా అరిపింతును నా – ހృదయార్పణ
విరిగి నలిగిన ఆత్మతోనూ హృదయపూర్వక ఆరాధనతో – సత్యముగా
1.
అద్భుతకరుడా ఆలోచన – ఆశ్చర్య సమాధాన ప్రభువా
బలవంతుడా బ..హు ప్రియుడా
మనోహరుడా మహిమరాజా – స్తుతించెదన్ ||నా ప్రాణ||
2.
విమోచనగానములతో – సౌందర్య ప్రేమ స్తుతులతో
నమస్కరించి ఆరాధింతున్
హర్షింతును నే పాడెదను – నా ప్రభువా ||నా ప్రాణ||
3.
గర్భమున పుట్టిన బిడ్డలన్ – కరుణింపక తల్లి మరచునా
మరచినగాని నీవెన్నడు
మరువవు విడువవు ఎడబాయవు – కరుణ రాజా ||నా ప్రాణ||
4.
రక్షణా అలంకారములను – అక్షయమగు నీ యాహారమును
రక్షకుడా – నా కొసగితివి
దీక్షతో నిన్ను వీక్షించుచు – స్తుతింతును ||నా ప్రాణ||
5.
నీ నీతిని నీ రక్షణను – నా పెదవులు ప్రకటించును
కృతజ్ఞతాస్తు...తులతోడ నీ ప్రేమను నే
వివరింతును – విమోచకా ||నా ప్రాణ||
6.
వాగ్దానములు నాలో నెరవేరెన్ – విమోచించి నా కిచ్చితివి
పాడెదను ప్రహర్షింతును
హల్లెలూయా – హల్లెలూయా ||నా ప్రాణ||