#663నరకముననునది - నిరంతరముండునయ్యో ఆ ఘోరనరకమ
Author: UnknownCategory: రెండవ అనుబంధము
1.
నరకమనునది – నిరంత ముండునయ్యో
ఆ ఘోర నరకము – నందు పాపులు బాధపడుదురయ్యో
మరియు అగ్ని పురుగులందున – కొరుకు చుండును తరుగులేకనూ
ధరణికాదిది దరియు కాదు – మరణమెదికిన దొరకదందున ||నరక||
2.
గప్పు గప్పున రగులుచుండునయ్యో – ఆ ఘోర నరకము నిప్పు లెగయుచు –
పొంగుచుండునయ్యో మబ్బువలె పొగ పైకి లేచును –
అబ్బా! అబ్బాని యేడుచుందురు బొబ్బలిడుదురు అడ్డమొచ్చెడి –
అబ్బలెవరు కానరందున ||నరక||
3.
నోరులెత్తి కొట్టుకొందురయ్యో – ప్రభు యేసు క్రీస్తును
నమ్మనందుకు నొచ్చుకొందురయ్యో – పురుగు చావదు అగ్ని ఆరదు
కొరుకుచుందురు – పండ్లు పటపట తిరిగితిరిగి చూచుచుందురు
– పరుగులెత్తక యేడుచుచుందురు ||నరక||