FaithWalk
← Back to Library

#662నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయా లోకం - నమ్మవద

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నమ్మవద్దు – నమ్మవద్దు ఈ మాయా లోకం – Nమ్మవద్దు ఇది – ఆశ చూపి మోసం చేయు – ఈ మాయాలోకం గనుక ||నమ్మవద్దు||
1.
మిమ్మునుగన్న తల్లి ఏది – మిమ్మునుగన్న తండ్రియేడి నాతోడ బుట్టిన తోడులు ఏరి – వారిన్ కాటికి మోసిన కోటప్ప లేరి – గనుక ||నమ్మవద్దు||
2.
మీరు కట్టిన యిండ్లు ఏవి మీరు – కట్టిన కోటలు ఏవి – కొట్టి తిన్న పొట్టలు ఉన్నవా? మెట్టలు పల్లాలు అవ్వక మానునా – గనుక ||నమ్మవద్దు||
3.
మీరు త్రవ్విన బావులు ఏవి – మీరు త్రాగిన నదులు ఏవి ఏరులు ఎండుకుండునా? కారులు మరచిపోకుండునా – గనుక ||నమ్మవద్దు||
4.
scan మీరు కట్టిన బట్టలు – ఏవి – చుట్టి త్రాగిన చుట్టలు ఏవి – కట్టినబట్ట మట్టికెక్కే కదా? చుట్టిన చుట్ట అగ్గికే కదా – గనుక ||నమ్మవద్దు||
5.
మనం మంటి నుండి తీయబడితిమి – మంటితో పుట్టబడితిమి – ఎట్టి బ్రతుకు బ్రతికినగాని కట్టె కాటికి పదపదరన్నా – గనుక ||నమ్మవద్దు||
6.
యేసు ప్రభుని నమ్మండిప్పుడే – మోసపోకుడి ఈ ధరణిలో – ప్రయాసపడి భారమును మోసెడి ఓ ప్రజలారా – గనుక ||నమ్మవద్దు||