#660దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు త
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
దొరుకుతావురా సహోదరా! దొరుకుతావురా నీవు
తరిమి తరిమి కీడుచేయ – పరుగెత్తినగాని తుదకు ||దొరుకు||
1.
చిన్న చూపు చూచి తమ్ముని – కన్నెర్ర జేసి చంపినగాని
అన్న కయీను దేవుని – హస్తమునకు దొరికిన రీతిగా ||దొరుకు||
2.
వరములు పొందిన తమ్ముని – చంపవలయునని పంతముగబట్టి
నరకమొచ్చి లోబడి యేడ్చిన – దురిత చరితుని ఏశావువలె ||దొరుకు||
3.
భక్త దావీదును బట్టి – ప్రాణము తీయదలచిన తన
శక్తితో తరిమిన రాజగు – సౌలు దొరికిన రీతిగానూ ||దొరుకు||
4.
విగ్రహమునకు మ్రొక్కని దైవ – పిల్లల నగ్నిలో పడవేసి
ఆగ్రహించిన నెబుకద్నెజరు – గడ్డిమేసి దొరికిన విధముగ ||దొరుకు||
5.
క్రైస్తవులను బట్టి కొట్టి – ఖైదులో వేయదలచిననూ
వాస్తవమగు వెలుగును జూసి – ప్రభువును చాటిన పౌలుబోలి ||దొరుకు||
6.
కీడుచేయబోకు మెప్పుడు – కీడు నీకే కీడు కీడు
キーడు చేసిన మేలు చేసి – కీడును జయించకపోతే ||దొరుకు||
7.
మాటలు కుదిరితే మాటలు – కోటలు కుదురును నీకు
మాటలలో లోటుంటే – నోటిమాట తప్పకుండా ||దొరుకు||
8.
దొంగతనము వ్యభిచారమునకు – లొంగి శాపగ్రస్తులై
దొంగిలించిన దశమభాగమే – లొంగుట కారణమని తుదకు ||దొరుకు||
9.
కొంత యిచ్చిన దశమభాగము – అంతయు ఇదియని తప్పుకొన్న
కొంత యిచ్చిన కయీనువలె – కొంత యిచ్చిన అననియవలె ||దొరుకు||
10.
చెడుగు చేసి బదులు దానిని – చేసినారని చెప్పమన్న వడిగ
దేవుని న్యాయమనెడి – పరమ త్రాసులో నిలువండి ||దొరుకు||