FaithWalk
← Back to Library

#659దేవుని స్తుతించుడి - ఎల్లప్పుడు దేవుని స

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
దేవుని స్తుతియించుడి – ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
1.
ఆయన పరిశుద్ధ ఆలయమందు – ఆయన సన్నిధిలో ఆ ఆ ||దేవుని||
2.
ఆయన బలమును ప్రసిద్ధి చేయు – ఆకాశ విశాలమందు ఆ ఆ ||దేవుని||
3.
ఆయన పరాక్రమ కార్యములను బట్టి – ఆయన ప్రభావమును ||దేవుని||
4.
బూరధ్వనితో ఆయనను స్తుతియించుడి – స్వరమండలముతో ఆ ఆ ||దేవుని||
5.
సన్నతంతుల సితారతోనూ – చక్కని స్వరములతో ||దేవుని||
6.
తంబురతోనూ – నాట్యముతోనూ తంత్రి వాద్యముతోనూ ఆ ఆ ||దేవుని||
7.
పిల్లనగ్రోవులు చల్లగనూది – ఎల్లప్రజలు చేరి ||దేవుని||
8.
మ్రోగుతాళములతో ఆయనను స్తుతియించుడి – గంభీర తాళముతో ఆ ఆ ||దేవుని||
9.
సకల ప్రాణులు యెహోవాను స్తుతియించుడి – హల్లెలూయా ఆమెన్ ఆ ఆ హల్లెలూయా ఆమెన్ ఎల్లప్పుడు ||దేవుని||