FaithWalk
← Back to Library

#658దేవుని వారసలం - ప్రేమ నివాసలము జీవన యాత్

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
దేవుని వారసులం – ప్రేమ నివాసలము జీవన యాత్రికులం యేసుని దాసులము – నవయుగ సైనికులం – పరలోక పౌరులము హల్లెలూయా – నవయుగ
1.
దారుణ హింసలలో – దేవుని దూతలుగా ఆరని జ్వాలలో – అగ్ని జయములతో – మారని ప్రేమ సమర్పణతో – సర్వత్ర యేసును కీర్తింతము ||దేవుని||
2.
పరిశుద్ధాత్మునికై – ప్రార్థన సలుపుదాము పరమాత్ముని రాక – బలము ప్రసాదింప – ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగహోమము చేయుదము ||దేవుని||
3.
అనుదిన కూటములు – అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయె – వీనులవిందగు పాటలతో ధ్యానము చేయుచు మరియుందుము ||దేవుని||
4.
సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులం – విధేయ బోధకులం – నిజముగ రక్షణ ప్రబలుటకై – ధ్వజముగ సిలువను నిలుపుదాము ||దేవుని||
5.
గోధుమ గింజవలె – క్రీస్తుడు చావగనూ నాథుని మరణములో – శాశ్వత జీవమును – నిధులుగా పండించి లేవగనూ – మాధుర్య రక్షణ లభించెను ||దేవుని||
6.
హతసాక్షుల కాలం – అవనిలో చెలరేగె గతకాలపు సేవ – గొల్గొత్తా గిరి – వీధులలో బహురీతులలో నూతన లోకము కాంక్షింతుము ||దేవుని||
7.
ప్రభువును చూచుటకై – ప్రజలందరు రాగ విభు మహిమను గాంచ విశ్వమేమవగోర – శుభములు గూర్చుచు మాలో – శోభిల్లు యేసును చూపుదాము ||దేవుని||