FaithWalk
← Back to Library

#661నడిపించు నా నావ - నడిసంద్రమున దేవా నవజీవ

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
నడిపించు నా నావ – నడిసంద్రమున దేవా నవజీవన మార్గమున – నా జన్మ తరియింప ||నడిపించు||
1.
నా జీవిత తీరమున – నా అపజయ భారమున నలిగిన నా హృదయమును – నడిపించు లోతునకు నా యాత్మ విరిబూయ – నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము – నా సేవ చేకొనుము ||నడిపించు||
2.
రాత్రంతయు శ్రమపడినా – రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ – రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ – రమణీయ లోతులలో రత్నాలను వెదకుటలో – రాజిల్లు నా పడవ ||నడిపించు||
3.
ఆత్మార్పణ చేయకయే – ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే – అన్వేషించితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశయై – ఆవేదన ఎదురాయె ఆధ్యాత్మిక లేమిగని – అల్లాడె నా వలలు ||నడిపించు||
4.
ప్రభు మార్గము విడిచితిని – ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని – పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో – ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిప్పుడు – పాటింతు నీ మాట ||నడిపించు||
5.
లోతైన జలములలో – లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి – లోపంబును సవరించి లోనున్న ఈవులలో – లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా – లోకేశ చేయుమయ ||నడిపించు||
6.
ప్రభు యేసుని శిష్యుడనై – ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో – పరిశుద్ధుని ప్రేమకథ పరమాత్మ ప్రోక్షణతో – పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు – పానార్పణము చేయుదు ||నడిపించు||