#657దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిద
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
దేవునికి స్తోత్రము గానము – చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము – చేయుటయే మంచిది
1.
యెరూషలేము యెహోవాయే – కట్టుచున్నవాడని (2)
ఇశ్రాయేలీయులను పోగుచేయువాడని ||దేవునికి||
2.
గుండె చెదరిన వారిని – బాగుచేయువాడని
వారి గాయములన్నియు – కట్టుచున్నవాడని ||దేవునికి||
3.
నక్షత్రముల సంఖ్యను – ఆయన నియమించును
వాటికన్నియు పేరులు – పెట్టుచున్నవాడని ||దేవునికి||
4.
ప్రభువు గొప్పవాడును – అధిక శక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే – మితియు లేనివాడని ||దేవునికి||
5.
దీనులకు అండాయనే – భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని – స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
6.
ఆయన ఆకాశమును – మేఘములతో కప్పును
భూమి కొరకు వర్షము – సిద్ధపరచువాడని ||దేవునికి||
7.
పర్వతములలో గడ్డిని – పశువులకు మొలిపించెను
అరచు పిల్లకుక్కలకును – ఆహారము తానిచ్చును ||దేవునికి||
8.
గుర్రముల నరులందరి – బలము నా నందించడు
కృప వేడు వారిలో – సంతోషించువాడని ||దేవునికి||
9.
యెరూషలేము యెహోవాను – సీయోను నీ దేవుని
కీర్తించుము కొనియాడుము – ఆనందించువాడని ||దేవునికి||
10.
పిల్లలన ఆశీర్వదించియు – బలపరచు నీ గుమ్మముల్
మంచి గోధుమ పంటతో – నిన్ను తృప్తిపరచును ||దేవునికి||
11.
భూమికి తన యాజ్ఞను – ఇచ్చువాడు ఆయనే
వేగముగాను దేవుని – వాక్యము పరుగెత్తును ||దేవునికి||
12.
వాక్యమును యాకోబుకు తెలియజేసినవాడని
ఏ జనయు ఈలాగున – చేసియుండ లేదని ||దేవునికి||