FaithWalk
← Back to Library

#656దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు (3)
1.
ఏదెనులో ఆదాముతో నుండెను – హనోకుకు తోడై నడిచెను దీర్ఘదర్శకులతో నుండెను – ధన్యులు దేవుని గలవారు ||తోడుగ||
2.
దైవాజ్ఞను శిరసావహించి – దివ్యముగా అబ్రాహాము – కన్న కొమరుని ఖండించుటకు – ఖడ్గము నెత్తిన యప్పుడు ||తోడుగ||
3.
యోసేపు ద్వేషించబడినప్పుడు – గోతిలో త్రోయబడినప్పుడు శోధనలో చెరసాల యందు సింహాసన మెక్కినయప్పుడు ||తోడుగ||
4.
ఫరోరాజు తరిమిన యప్పుడు – ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది దాటునప్పుడు – యెరికో కూలినయప్పుడు ||తోడుగ||
5.
దావీదు సింహము నెదిరించి – ధైర్యమున నిల్చిన యప్పుడు గొల్యాతును హతమార్చినప్పుడు – సౌలు చేత తరుమబడినప్పుడు ||తోడుగ||
6.
సింహపు బోనులో దానియేలు – షద్రకు మేషాకు అబేద్నెగో అగ్ని గుండములో వేయబడెను – నలుగురుగా కనబడినప్పుడు ||తోడుగ||
7.
పౌలు బంధించబడినప్పుడు – పేతురు చెరసాలలోనున్నప్పుడు అపొస్తలుల విశ్వాసులు – హింసించబడినయప్పుడు ||తోడుగ||