FaithWalk
← Back to Library

#653జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుద

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
జీవితమంత నీ ప్రేమగానం ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతుము మేము – నీ కీర్తిన్ – ఆనందగానంబుతో ||జీవితమంత||
1.
సర్వ సమయములలో నీ స్తుతి గానం – ఎల్లా వేళలయందు నీ నామధ్యానం మాకిదియే మేలు – ఈ జీవితమున – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||
2.
సృష్టినంతటినీ నీ మాటచేత – సృజియించితివిగా మా దేవదేవా నీ ఘనమగు మహిమను – వర్ణింప తరమా – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||
3.
కలుషితాత్ములమైన మా కొరకు నీ – విలువైన ప్రాణంబు నర్పించితివిగా కలవరి గిరిపై చూపిన ప్రేమను – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||
4.
పరిశుద్ధమైన నీ సన్నిధిలో – శాశ్వతమైన నీ రాజ్యాంబులో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా – స్తుతియింతు నా రక్షకా ||జీవితమంత||