#650చూడుము గెత్సేమనే - తోటలో నా ప్రభువు పాపి
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
చూడుము గెత్సేమనే – తోటలో నా ప్రభువు పాపి నాకై
విజ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది పాపి నీకై విజ్ఞాపన చేసెడి – ధ్వని
వినబడుచున్నది
1.
దేహమంతయు నలిగి – శోకము చెందినవాడై
దేవాది దేవుని – ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే ||చూడుము||
2.
తండ్రి ఈ పాత్ర తొలగున్ – నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ – చిత్తము చేయుటకు నన్నప్పగించుదుననెను ||చూడుము||
3.
రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు – హృదయము పగులగా – విజ్ఞాపనము చేసెనే ||చూడుము||
4.
ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే – మన యేసు
ప్రभुవు – తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే ||చూడుము||
5.
ప్రేమామృత వాక్కులచే – ఆదరించెడి ప్రభువు – వేదన
సమయమున – బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెనే ||చూడుము||
6.
నన్ను తనవలె మార్చెడి – ఈ మహా ప్రేమను తలచి
తలచి హృదయము కరుగగా – సదా కీర్తించెదను ||చూడుము||