FaithWalk
← Back to Library

#649గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
యేసురాజు లేచెనని హల్లెలూయ జయమార్భటం చేసెదము
1.
చూడు సమాధిని మూసిన రాయి దొర్లింపబడెను – అందు వేసిన ముద్ర కావలి నిల్చెనా – దైవ సుతుని ముందు ||గీతం||
2.
వలదు వలదు ఏడువవలదు – వెళ్ళుడి గలిలయకు – తాను చెప్పిన విధమున తిరిగి లేచెను – పరుగిడి ప్రకటించుడి ||గీతం||
3.
అన్న-కయపవారల సభయు అదరుచు పరుగిడిరి – ఇంక భూతగణముల ధ్వనిని వినుచు – వణకుచు భయపడిరి ||గీతం||
4.
గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి – జయవీరుడు రాగా మీ వాతతాళ వాద్యముల్ – బూరలెత్తి ధ్వనించుడి ||గీతం||