FaithWalk
← Back to Library

#648గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసికొని

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
గగనము చీల్చుకొని యేసు – ఘనులను తీసికొని – వేలాది దూతలతో భువికి వేగమే రానుండె
1.
పరలోక పెద్దలతో – పరివారముతో కదలి ధరాసంఘ వధువునకై – తరలెను వరుడిదిగో ||గగనము||
2.
మొదట గొర్రెపిల్లగాను – ముదమారగ వచ్చెను కొదమసింహపురీతి – కదలెను గర్జనతో ||గగనము||
3.
కనిపెట్టు భక్తాది – కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచెదరు – పరిశుద్ధులు మృతులు ||గగనము||