#646క్రైస్తవుడా కదలిరావయ్యా కలుషితాత్ములకు ఈ
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
క్రైస్తవుడా కదలిరావయ్యా కలుషితాత్ములకు ఈ సిలువశక్తి
చాటవయ్యా – ఎండమావులనియూ భ్రమసి
ఎంతకాలము మూలనుందువు – కుండలను ప్రేమింతువనుచున్నావు
ఈ మంటికుండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||క్రైస్తవ||
1.
వసుధలో ప్రజలెల్లరు యేసు – వాక్యంబు
వివక్షుధా బద్ధులై వాంఛించుచుండగనూ – మిషనరీలనెల్ల మిషనరీల చేత
మిట్టపడుచు వాదములతో – యేసు బోధను విడిచినారన్నా
నీవెంతకాలము – వారిచెంతనుందువోరన్నా ||క్రైస్తవ||
2.
సత్యవాక్యము సంతలో వదలి బోధకులు
దొరలు భత్యములపై భ్రాంతులు నిలిపి – చిత్రమగు అనుకూల
బోధలు చేసి ప్రజలను మోసగించు సూత్రధారులు
చేరరాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము
చాటరావయ్యా ||క్రైస్తవ||
3.
శక్తిహీనుడనందువేమయ్యా – సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని
పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట
మనస్సు – బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు
సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||క్రైస్తవ||
4.
నీతికొరకై భక్తాది వరులెల్ల – నిజవిశ్వాసము నిలుపుకొన పోరాడిరే –
చాల కత్తిపోట్లు రాళ్ళదెబ్బలు కరకుగల
రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు – పైబడి
పలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||క్రైస్తవ||
5.
ఆది సంఘము నారుపాటకు నెంచి ఆ దుష్ట నిరో అధిపతి
చెలరేగి గర్జించి ఆదిక్రైస్తవ భక్తుల స్తంభముల గట్టి
తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘము మెచ్చె
అధిపతి అప్పుడే నశించె ||క్రైస్తవ||
6.
దూతలకు లేనట్టి పరిచర్య – ఓ ప్రియసఖుడా ఖ్యాతిగా
నీ కిచ్చె గ్రంథంబు – రుచియు రసము తినుము గ్రంథము – తేనెవలె
మధురముగ నుండును – జ్ఞానము నీకబ్బును హితుడా
జ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుడా ||క్రైస్తవా||