#645క్రైస్తవ కర్షక - కదలిరావయ్యా కన్నులు తెర
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
కోతకాలము – గతించిపోయె
గ్రీష్మకాలముకూడ – జరిగిపోయె ||క్రైస్తవ||
1.
మనుష్య కుమారుడైన క్రీస్తుయేసు
మంచివిత్తనమును విత్తమున్న భూలోకంబనెడు – పొలంబందున
వాక్యంబనె విత్తనంబు విత్తెను ||క్రైస్తవ||
2.
ఆదిమ క్రైస్తవ – బోధకుల వేదనతోనూ – వాక్యంబు విత్తె
రోదనతోనూ – రక్తంబును గార్చి ప్రాణంబులను
దానంబుజేసిరి ||క్రైస్తవ||
3.
చల్లిన వాక్యము – ఫలించును తొలకరి
వర్షము కురిపించెను విలువైన ఫలములు – ఫలించు వరకు
కడవరి వర్షము – కొరకు వేడుదాం ||క్రైస్తవ||
4.
పొలములు – తెల్లబారె – తెరిచిచూడు కాలము చాల
గతించిపోయె కోత యజమానుడైన క్రీస్తుని
కోతవారిని – పంప కోరివేడుదాం ||క్రైస్తవ||
5.
శత్రువగు – సాతానుకూడా చెడ్డవిత్తనాలు – చల్లిపోయె
గోధుమల మధ్య – గురుగులు కూడ ప్రచురంబుగానూ
పెరుగుచుండెను ||క్రైస్తవ||
6.
కన్నీళ్ళతో విత్తు – క్రైస్తవుడా కలవర మొందేద వెందులకు
సంతోషముతో – సంగీతములతోనూ
సాగిపోవుదుము – ఆగిపోకనూ ||క్రైస్తవ||