#644కుమ్మరి ఓ కుమ్మరి
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
కుమ్మరి ఓ కుమ్మరి – జగదుత్పత్తిదారీ
జిగటమన్నైన నా వంక – చల్లగ చూడవయ్యా......
1.
పనికిరాని పాత్రనని – పారవేయకుమా – పొంగిపొరలు
పాత్రగా జేసి – నన్ను నింపుమా – సువార్తలోని పాత్రలన్నీ –
శ్రీ యేసున్ పొగుడుచుండ – సాక్షిగ నుండు
పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
2.
విలువలేని పాత్రనై నేను కొనువారులెవరు
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి
ఆటంకముల నుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా ||కుమ్మరి||
3.
లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్
మనుష్యేచ్ఛలన్నియును – స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిన్
పోగొట్టుకున్న పాత్రననుచు – పరుగెత్తి నన్ను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబులనే పట్టితిన్ ||కుమ్మరి||