FaithWalk
← Back to Library

#643కలవరి గిరిలోని శ్రేష్ఠుడా - కరుణాభరిత సి

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
కలవరిలోని ప్రభువా – సిలువలోని మిత్రుడా కరుణభరిత సింహాసనము – కనులు భ్రమించు ప్రభువా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
1.
స్తుతికి పాత్రుండగువాడా – దూతలతో వేంచేయువాడా స్తుతి మరియు పుత్రుడా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
2.
పాపులకై వచ్చినవాడా – ప్రేమగలిగిన రక్షకుడా పాదములపై పడితిమి – సిలువలోని మిత్రుడా ||కలవరి||
3.
దీవెనలు ఇచ్చువాడా – వసుధకే తెంచినవాడా నీవే సుంకరి ఆప్తుడవు – సిలువలోని మిత్రుడా ||కలవరి||
4.
ఐదు రొట్టెలు మరి రెండు – చేపలతో నైదు వేల జనుల పోషించిన తండ్రి – సిలువలోని మిత్రుడా ||కలవరి||
5.
నీళ్ళను రసముగా మార్చితివి – నీళ్ళమీద నడిచితివి మేళ్ళనొసగు మా దాతా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
6.
రోగులను బాగుచేయువాడా – గ్రుడ్డికి నేత్రములిచ్చితివి అనాథల నాయకుడా – సిలువలోని మిత్రుడా ||కలవరి||
7.
హల్లెలూయ కర్తుడా – ఎల్లరు కొనియాడువాడా బలముతో వచ్చు రాజా – సిలువలోని మిత్రుడా ||కలవరి||