FaithWalk
← Back to Library

#64దేవుని ప్రేమ

Author: చదలవాడ జెకర్యాCategory: సాయంతనారాధన
ప
ఎంత ప్రేమించెనో దేవుడు మనపై – నెంత దయ చూపెనో వింతగల యీ దైవ ప్రేమను – శాంతమున ధ్యానింపరే || ఎంత ||
1.
పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లల మనబడుటకై – తన కుమారుని మరణ బలి రక్తమున మనలను స్వీకరించుకొనెను దీనిని చూడరే || ఎంత ||
2.
పెంటకుప్పమీద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనెత్తి మింటిపై – ఘనులతో కూర్చుండజేయ మనవంటి హేతువైన మనవంటి దేహము దాల్చి || ఎంత ||
3.
ద్రాక్షారసపు మధుర వరమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపరుండగా – ఈ క్షితి నా ప్రేమ ద్రాక్షారసముకంటే – దీక్షగ వేడి యపేక్షింపదగునా హా || ఎంత ||
4.
మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన – ఘనుడా కాశమునుండి మరలి వచ్చి – మన దైన్యదేహమును తన రూపముకు మార్చి – కొనిపోయి తన రాజ్యమును మనకియ్యును || ఎంత ||
5.
గట్టిగ మనమున నిట్టి నిరీక్షణ – పెట్టియున్న సత్ క్రైస్తవులారా ప్రభువట్టివాడొ మనమునట్టివారుగ ప్రభుని – కట్టడలను మదిని బెట్టియుందము వేడకన్ || ఎంత ||