FaithWalk
← Back to Library

#63ప్రత్యేక దేవునికి స్తుతి

Author: పాలపర్తి యాకోబుCategory: సాయంతనారాధన
ప
పరమపురి కల్పభూజ – నిరతభూ నరుల పూజ – యురుతరచిత మహిమతేజ – వరనుతి సలిపెదము రాజ || పరమ ||
1.
జనక సుత శుద్ధాత్మ – యను పేరిట ఏకాత్మ – ఘనతర సంరక్ష ప్రేమ – ననిపి మము గని కరుణించు || పరమ ||
2.
నీవే మా ప్రాపువంచు – నెరనమ్మి యుందుమంచు – భావంబున తలచువారి – పావనుల జేయు సదా || పరమ ||
3.
కలుషంబులను హరింప – నిల సైతానును జయింప – బలుమారు నిను దలంచ – బలము గల ప్రభుండ వీవే || పరమ ||
4.
ఈ లోక పాపనరులు – చాల నిను నమ్మి మరల – దూలిచే దారుణ సైతానును బడ ద్రొక్కి వేయు || పరమ ||
5.
అల్పా ఓ మేగయును – నాద్యంతంబులును – కల్పాంత స్థాయివైన – కర్తా కరుణించు మమ్మును || పరమ ||