FaithWalk
← Back to Library

#62అనంత సహాయుడగు దేవుడు

Author: జాన్ చౌదరిCategory: సాయంతనారాధన
1.
గతకాలములయందు – ఘనసహాయుడ దేవా – హితనిరీక్షణ నీవే – యెన్నెండ్లకైన – జుటిగా విసరిన గాడ్పులందు దుర్గంబవై – నిత్మాంత గృహమీవే – నిత్యుడౌ ప్రభువా || గత ||
2.
నీ సింహాసన ఛాయలో – సురక్షితముగ – వాసము చేయుదము – భవ్యగుణతేజా – నీ సుబాహువే చాలు – నిశ్చయ సురక్ష – వాసంబుగా నొప్పె – ప్రభువా ఘన దేవా || గత ||
3.
నగముల్ వరస నిలిచి – నగధరి నిర్మాణమగుటకు మున్నే యనంత – ప్రభువు నీవు – అగణిత వత్సరముల్ – నీవే మా – భగవంతుడవు నిన్ను ప్రణుతింతుము మేము || గత ||
4.
వేయి యుగములు నీకు – దెసగతించిన యొక్క – సాయంత్ర సదృశము – సవిత్రుడురు శోభాయుతముగ లేవక ముందు రాత్రిలో – ప్రహరము సుమీ యవి || గత ||
5.
గతకాలములయందు – ఘన సహాయుడ దేవా – హిత నిరీక్షణ నీవే – యెన్నెండ్లకైన – క్షితిజీవితాంతము – గతిగానుండుము దేవా – నితాంత గృహమీవే – నిత్యుడౌ ప్రభువా || గత ||