FaithWalk
← Back to Library

#61సృష్టికర్త స్తుతి

Author: విలియం డాసన్Category: సాయంతనారాధన
1.
ఒక్కడే మన కర్తయై యుండు దేవుడనియున్ – చక్కగాను సృజియించు సంహరించు ననియున్ – నిక్కముగ తెలిసికొండి మన సహాయమే – మక్కువ లేకుండ మనల మిక్కుటపు పరిపాలనపు బలముచే జేసె – మృతు చే మానవులగ దిక్కు గానక తిరుగు గొర్రెల వలె మనము చెదరగా దిరుగు దన దొడ్డి బెట్టె నా జనులారా ఘనుడైన ||
2.
మేమందరము వందనపు పాటతో మునిగి – మించు నీ గుమ్మములలో – మామా స్వరము లెత్తుదము నభము పొడవుగా – మధుర లయ సహితముగను – భూమియున్ తన యందు పదివేల జిహ్వల వలె బొందైన నీ నగరికై ధామంబులను గాన సన్నుతి వితతి పూరి తమ్ములుగా జేయు దేవా యో జనులారా ఘనుడైన ||
3.
ధరయంత విశాలమై యున్నది నీ యాజ్ఞ – తగ విరహితాద్యంతమై స్థిరమైన కాలంబువలెనే యున్న దయదయ – పొరలిపోవుచునున్న వత్సరముల్ నిలిచిపోయినప్పటికిని నీదు సత్యంబు నిలిచియుండున్ – వర శిలా ఖండ పర్వతము తోడను సాటి వన్నెకెక్కుచు నెంతయును ఓ జనులారా ఘనుడైన ||