FaithWalk
← Back to Library

#60తండ్రియగు దేవుడు

Author: పులిపాక జగన్నాథముCategory: సాయంతనారాధన
ప
గొప్ప దేవా నాకు తండ్రివి – యాకాశమందు గొప్ప దేవా నాకు తండ్రివి – తప్పకుండా వచ్చు నీ దరికి యేసు నామమందు – గొప్ప కరుణ చేత నన్ను ఇప్పుడు చేర్చుకొనుము || గొప్ప ||
1.
నీవు మిగుల గొప్పవాడవు – నా సృష్టికర్తవు – ఈవు ఎల్లప్పుడు ఇచ్చువాడవు – భావమందు నిన్ను తలంచి – పావనాత్మ నాకు ఇచ్చి – జీవమార్గమందు నిలిపి – కావుమనుచు వేడుకొందు || గొప్ప ||
2.
చిన్నవాని నాలించి ప్రార్థన – ఈ లోకమందు – మునుపు దయను నిల్చినవాడవు – సన్నుతుడగు యేసు నీదు – సన్నిధి నున్నాడుగాన – నన్ను గని కరుణించుమనుచు – నిన్ను నమ్మి వచ్చుచున్నాను ఇప్పుడు || గొప్ప ||
3.
విలువ గల నీదు నాజల్ లు – నా హృదయమందు – బలు విధములతో తలచుచుందును – పలుకులందును పనులందును – బలము చూపి నిన్ను కొలిచి – ఇలను నిన్ను ప్రతిపరుతు – నలయక నీ కరుణ మెరయగ || గొప్ప ||
4.
మీది రాజ్యమందు చేర్చుము – కరుణాసముద్ర – బీదనైన నన్ను గరుణించి – సోదరులను గూడికొనుచు – మోదమొప్పగా నీదు సేవ – బాదుకొనుచునుందును నీ పాదపద్మములను బట్టి || గొప్ప ||