#637ఎంత దూరము మోయించెదరు స్వామి
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ఎంతదూరము మోయించెదరు స్వామి కింత సిలువనెత్తి నుంతైన దయలేక ||ఎంత||
1.
ఒంటిగా ప్రార్థించి యుపవాసములు చేసి కంటి నిదురలేక కలతజెందిన ప్రభుని ||ఎంత||
2.
సొమ్మునాశించి గురువునమ్ముకొన్న యూదా నమ్మించి మీకిచ్చిన ఇమ్మానుయేలును ||ఎంత||
3.
కరములు జోడించి కడకు గెత్సెమనేలో పరమ తండ్రిని వేడు నిరపరాధిని పట్టి ||ఎంత||
4.
పిరికి పిలాతుని బెదిరించి యదలించి యెరూషలేము వీధుల యేసుని ద్రిప్పుచు ||ఎంత||
5.
ఒడలలసి నా ప్రభువు తడబడుచుండగా ఘడియ ఘడియకు తిట్టి గట్టిగా కొట్టుచు ||ఎంత||
6.
కల్వరి గిరివరకు సిలువ మోయలేక అలసిన ప్రభువు చంప నా లస్యమును చేసి ||ఎంత||
7.
యేసు నీకొరకై నేను ఏడ్చుటకంటెను దోషినని గ్రహించి దోసిలొగ్గుటే మేలు ||ఎంత||