FaithWalk
← Back to Library

#638ఎందుకో నన్నింతగా నీవు

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ఎందుకో నన్నింతగా నీవు – ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర – హల్లెలూయా యేసయ్యా ||
1.
నా పాపము బాప – నరరూపివైనావు నా శాపము మాప – నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే – నా స్థానములో నీవే ||హల్లెలూయా||
2.
నీ రూపము నాలో – నిర్మించియున్నావు నీ పోలికలోనే – నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి – నీ కొరకై నీ కృపలో ||హల్లెలూయా||
3.
నా శ్రమలు సహించి – నా ఆశ్రయమైనావు నా వేదనలు భరించి – నన్నాదుకున్నావు నన్ను నీలో చూచుకున్నావు – నన్ను దాచియున్నావు ||హల్లెలూయా||
4.
నీ సన్నిధి నాలో – నా సర్వము నీలో నీ సంపద నాలో – నా సర్వస్వము నీలో నీవు నేను ఏకమగువరకు – నన్ను విడువనంటివే ||హల్లెలూయా||
5.
నా మనువులు ముందే – నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందే – నీ గ్రంథంబులో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం – నేనేమి చెల్లింతును ||హల్లెలూయా||