#636ఎంత జాలి యేసువా యింతయని ఊహించలేను
Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ఎంత జాలి యేసువా యింతయని యూహించలేను ||ఎంత||
1.
హానికరుడు హింసకుడును – దేవ దూషకుడను నేను అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా ||ఎంత||
2.
రక్షకుండా నాకు బదులు – శిక్ష ననుభవించినావు సిలువయందు సొమ్మసిల్లి – చావొందితి నాకై ||ఎంత||
3.
ఏమి నీ కర్పించగలను – ఏమి లేనివాడనయ్య రక్షణంపు పాత్రనెత్తి – స్తోత్రమంచు పాడెదా ||ఎంత||
4.
నీదు నామమునకు ఇలలో – భయపడెడివారి కొరకై నాథుడా నీవిచ్చు మేలు – ఎంత గొప్ప దేశివా ||ఎంత||
5.
నేను బ్రతుకు దినములన్ని – క్షేమమేల్ల వేళలందు నిశ్చయముగా నీవు నాకు – ఇచ్చువాడవు ప్రభో ||ఎంత||
6.
నాదు ప్రాణమునకు ప్రభువా – సేదదీర్చువాడవు నీవు నాదు కాపరివి నీవు – నాకు లేమి లేదుగా ||ఎంత||
7.
అందరిలో అతి శ్రేష్ఠుడా – అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా స్తోత్రములను – హర్షముతో పాడెదా ||ఎంత||