FaithWalk
← Back to Library

#635ఎవని అతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
ఎవని యతిక్రమములు మన్నింపబడెనో పాపపరిహార మెవడొందెనో వాడు ధన్యుడు ||
1.
యెహోవాచే నిరపరాధిగా తీర్చబడియు ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు ||ఎవని||
2.
మౌనినైయుండి దినమెల్లా నేను చేసినట్టి ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను ||ఎవని||
3.
దివారాత్రములు నీ చేయి నాపై బరువైయుండ నా సారము వేసవిలో ఎండినట్లాయె ||ఎవని||
4.
నేను నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని ||ఎవని||
5.
నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా నీవు నా దోషమును మన్నించితివిగదా ||ఎవని||
6.
కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు ||ఎవని||
7.
విస్తార జలప్రవాహము పొర్లినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు ||ఎవని||
8.
నాకు దాగు చోటు నీవే శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా ||ఎవని||
9.
విమోచనగానములతో నీవు నన్ను ఆదరించి నాదు పథము చేసెదవు ||ఎవని||