#576We Give Thee But Thine Own
Author: విలియం వాలహామ్Category: క్రైస్తవ కుటుంబము
1.
మేము ఇచ్చు కానుకల్ నీవే మాకిచ్చితివి – మా యాస్తియంత ప్రభువా నీ దానమే గదా.
నీవుచితముగా – మా కిచ్చువాడవు అన్యులకుచితముగా – మేము ఇచ్చుచుందుము.
సర్వత్ర బీదలు అన్నంబునొందరు – కన్నీళ్ళు రాల్చు ప్రజలు – అనేకులుందురు.
ఈలాటివారికి – సహాయమిచ్చుట దాతలు చేయు సేవకు సమానమగును.
పోషించి బీదలను – రక్షించి పాపులను అందరిని సంరక్షించుట – శ్రీ యేసు కార్యమే.
నా బీదవారికి నీవిచ్చు దానము – నా కితువను వాక్యము – శ్రీ యేసు చెప్పెను.