FaithWalk
← Back to Library

#575క్రైస్తవ దాతృత్వము

Author: మోచర్ల రాఘవయ్యComposer/Ragam: సౌరాష్ట్ర (ఛాయ: మనసానందము బొందుట కన్నను)Category: క్రైస్తవ కుటుంబము
ప
సంతోషముతో నిచ్చెడివారిని – నెంతో దేవుడు ప్రేమించున్ – వింతగా వలసిన దంతయు నొసంగును – వినయ మనసుగల – విశ్వాసులకును ||సంతోషముతో||
1.
అత్యాసక్తితో నధికప్రేమతో – నంధకార జను లందరకు – సత్య సువార్తను – జాటించుటకై – సతతము తిరిగెడి – సద్భక్తులకు ||సంతోషముతో||
2.
వేద వాక్యమును వేరు వేరుగా – మాదుల నుండెడి బాలురకు – సాధువులు ప్రభుని సు – బోధలు నేర్పెడి – సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||
3.
దిక్కెవ్వరు లేకుండెడి దీనుల – తక్కువ లన్నిటి తీర్చుటకై – నిక్కంపు రక్షణ – నిద్రలో నలు – ప్రక్కలలో బ్రక – టించుట కొరకై ||సంతోషముతో||
4.
ఇయ్యండి మీకీయం బడునని – యియ్యగల ప్రభు యేసనెను – ఇయ్యది మరువక – మదిని నుంచుకొని – యియ్యవలెను మన – రీవుల నికను ||సంతోషముతో||
5.
భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు – యుక్త మటంచును – దారతతో – శక్తికొలది మన భుక్తి నుండి యా – శక్తితో నిరతము – నియ్య వలెను ||సంతోషముతో||